: అద్వానీతో భేటీ అయిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు

రాష్ట్ర విభజన అంశం కీలక దశకు చేరిన నేపథ్యంలో, సీమాంధ్ర కేంద్ర మంత్రులు లాబీయింగ్ ముమ్మరం చేశారు. స్వపక్షం, వైరిపక్షం అనే తేడా లేకుండా అందరినీ కలుస్తూ, ఏకపక్షంగా జరుగుతున్న రాష్ట్ర విభజనను వ్యతిరేకించాలని కోరుతున్నారు. ఈ రోజు కావూరి సాంబశివరావు నేతృత్వంలోని సీమాంధ్ర కేంద్ర మంత్రుల బృందం బీజేపీ అగ్రనేత అద్వానీతో భేటీ అయింది. సమావేశమయిన వారిలో కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు ఉన్నారు. విభజనను అడ్డుకోవాలని, సస్పెండైన ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేయించాలని వారు అద్వానీని కోరినట్టు తెలుస్తోంది.

More Telugu News