: ఎట్టకేలకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పోస్టింగ్
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఎట్టకేలకు మహారాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. మహారాష్ట్రలోని థానె నగర సంయుక్త పోలీసు కమీషనర్ గా ఆయనను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్ర క్యాడర్ నుంచి సీబీఐకు డిప్యూటేషన్ పై ఆయన హైదరాబాదుకు వచ్చారు. ఈ నేపథ్యంలో పలు కీలకమైన కేసుల్లో విచారణ అధికారిగా వ్యవహరించారు. ఓబుళాపురం మైనింగ్ కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, సత్యం కేసు గుజరాత్ లో సోహ్రబుద్దీన్ ఎన్ కౌంటర్ ... తదితర కేసుల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు . 1990లో ఐపీఎస్ కు ఎంపికైన ఆయన మహారాష్ట్ర క్యాడర్ లో నియమితులై నాందేడ్ ఎస్పీగా, ఉగ్రవాద వ్యతిరేక దళంలో కీలక అధికారిగా.. పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.