: బిల్లు చర్చకు రాగానే ముఖ్యమంత్రి రాజీనామా: వీరశివారెడ్డి

రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభలో చర్చకు రాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరాశివారెడ్డి తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజీనామా అంశంతో పాటు కొత్త పార్టీ ఏర్పాటు... తదితర అంశాలను సమావేశంలో చర్చించినట్టు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఆయన అన్నారు. మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన అంశంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, లోక్ సభలో సీమాంధ్ర ఎంపీలపై జరిగిన దాడే అందుకు నిదర్శనమని అన్నారు. విభజన బిల్లు చర్చకు రాగానే సీఎం రాజీనామా చేయడం ఖాయమని తెలిపారు.

More Telugu News