: మళ్ళీ గొడవ చేసేందుకు సీమాంధ్ర ఎంపీలు కుట్ర పన్నుతున్నారు: పొన్నం

సీమాంధ్ర ఎంపీలు మరోసారి లోక్ సభలో రగడ సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత గురువారం సభలో రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టగా, ఎంపీల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో, స్పీకర్ మీరా కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. రేపు సభ ప్రారంభం కానుండగా, సీమాంధ్ర సభ్యులు మరోసారి గొడవకు యత్నించే అవకాశాలున్నాయని పొన్నం అభిప్రాయపడ్డారు. కాగా, బహిష్కరణకు గురైన ఎంపీలతో భేటీ అయిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని తొలగించాలని పొన్నం అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు.

More Telugu News