: ప్రకాశ్ కారత్ మాతో కలిసి వస్తామన్నారు: జగన్

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హస్తినలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ తో భేటీ అయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని ఆయన కారత్ ను కోరారు. అసెంబ్లీ తిరస్కరించినా, బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారని.. బిల్లును ప్రవేశపెట్టేముందు అభిప్రాయం తెలుసుకోకుండా, అంతా పది సెకన్లలో ముగించేశారని జగన్ ఆయనకు వివరించారు. ఈ అన్యాయాన్ని అంగీకరిస్తే దుష్ట సంప్రదాయానికి బాటలు పరిచినట్టేనని జగన్ పేర్కొన్నారు. భేటీ అనంతరం జగన్ మాట్లాడుతూ, కారత్ తమతో కలిసి వస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.

More Telugu News