: దాడి చేసిన ఎంపీలే మొదటి ముద్దాయిలు: కోడెల
రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. ఎంపీలు లగడపాటి, మోదుగులను తప్పుబట్టడం సరికాదన్నారు. భౌతికదాడులకు తెరదీసిన ఎంపీలే మొదటి ముద్దాయిలని పేర్కొన్నారు. ఎక్కడో ఇటలీలో పుట్టిన సోనియా తెలుగుజాతి మధ్య చిచ్చు పెడుతోందని దుయ్యబట్టారు. నియంత ముస్సోలినీ పుట్టిన దేశంలో జన్మించిన సోనియా... గాంధీ పుట్టిన దేశాన్ని కళంకితం చేస్తోందని విమర్శించారు.