: మన పట్టు జారుతోందా..?

న్యూజిలాండ్ తో రెండో టెస్టులో భారత్ పట్టు జారుతోందా..? రెండో రోజు ఆటలో పట్టు బిగించిన భారత్.. మూడో రోజు ఆటలో కివీస్ పోరాట పటిమకు లొంగిపోయిందా..? కెప్టెన్ మెకల్లమ్ (114 బ్యాటింగ్), వాట్లింగ్ (51 బ్యాటింగ్) వీరోచిత ప్రదర్శన చూస్తే ఇది నిజమనిపించకమానదు. 246 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు ఇప్పుడు టీమిండియాపై 6 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. మూడో రోజు ఆట చివరికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 192, భారత్ 438 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. నాలుగోరోజు ధాటిగా ఆడి మరిన్ని పరుగులు చేసి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలిగితే.. సిరీస్ గెలిచేందుకు కివీస్ కు అవకాశాలుంటాయి. అదే సమయంలో భారత్ రేపటి ఆట తొలి సెషన్లో పిచ్ పరిస్థితులను ఉపయోగించుకుని మెకల్లమ్, వాట్లింగ్ జోడీని విడదీయగలిగితే మ్యాచ్ గెలవడంతోపాటు, సిరీస్ ను సమం చేయగలుగుతుంది.

More Telugu News