: మాజీ పోలీసు జోలికెళ్లి కేసులో ఇరుక్కున్న కుక్క

వీధి కుక్క ఒకటి దారినపోయే ఒకాయన వెంటపడి కరిచింది. పాపం, దానికి ఆ సమయంలో తెలియలేదు.. తాను దాడి చేస్తున్నది ఒక మాజీ పోలీసు అధికారి మీదనని. అంతే... చివరికి కేసులో ఇరుక్కుంది. ఢిల్లీలో ఎస్ఐగా చేసి రిటైరైన విజయ్ సింగ్ ఈ నెల 13న ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షార్ జిల్లా గులోటి పోలీస్ స్టేషన్ పరిధిలో నడచి వెళుతుంటే వీధి కుక్క కరిచి పారిపోయింది. ఆయన స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అసలే మాజీ ఎస్ఐ.. ఫిర్యాదు తీసుకోకపోతే ఫీలవుతాడేమో అని అనుకున్నట్లున్నారు! ఆ కుక్కపై పోలీసులు కేసు పెట్టేశారు.

More Telugu News