: ఇదీ తెలుగోడి సత్తా: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పటంలో నిలిపింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘ప్రజాగర్జన’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. హైటెక్ సిటీని ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని ఆయన స్పష్టం చేశారు. ముందుచూపుతో యువతకు భారీగా ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సాఫ్ట్ వేర్ కంపెనీలతో కూడిన హైటెక్ సిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేని యువశక్తి భారత్ లో ఉంది. ఉరకలేసే యువరక్తంతో భారత్ ఉప్పొంగుతోందని ఆయన తెలిపారు. ఇవాళ ప్రపంచంలో ప్రతి చోటా తెలుగువాడు రాణిస్తున్నాడని చంద్రబాబు చెప్పారు. ప్రపంచ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కి సీఈవో పగ్గాలు చేపట్టిన సత్య నాదెళ్ల తెలుగువాడని ఆయన గుర్తు చేశారు.

జాతీయ స్థాయిలో కూడా తెలుగువారు సేవలందించారని ఆయన గుర్తు చేశారు. త్రివర్ణ పతాకాన్ని రూపొందించినది తెలుగువాడైన పింగళి వెంకయ్య అని, ఆంధ్రా బ్యాంకును నెలకొల్పిన వ్యక్తి మన రాష్ట్రానికి చెందిన భోగరాజు పట్టాభి సీతారామయ్యేనని ఆయన చెప్పారు. కొండా వెంకటప్పయ్య, టంగుటూరి ప్రకాశం వంటి అనేక మంది స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారని..చెబుతూ, తెలుగు వారు జాతికి చేసిన సేవలను బాబు గుర్తు చేశారు.

More Telugu News