: వనప్రవేశం చేసిన సమ్మక్క-సారక్క... ముగిసిన మేడారం జాతర

వరంగల్ జిల్లా మేడారంలో నాలుగు రోజుల పాటు సందడిగా సాగిన మహాజాతర ఇవాళ్టితో ముగిసింది. గిరిజన దేవతలైన సమ్మక్క, సారక్క వనప్రవేశంతో జాతరలో కీలక ఘట్టం ముగిసింది. గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు అమ్మవార్లను వనప్రవేశం చేయించారు. సమ్మక్కను చిలుకలగుట్ట, సారలమ్మను కన్నెపల్లికి చేర్చారు. గోవిందరాజును కొండాయి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు తీసుకెళుతున్నారు.

మేడారం జాతర విజయవంతమైందని వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్, ఎస్పీ కాళిదాసు ప్రకటించారు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనా, భక్తులకు దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు కలుగలేదని వారు తెలిపారు. సుమారు కోటి మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని కలెక్టర్ వెల్లడించారు.

More Telugu News