: హమ్మయ్య... పీడకల ముగిసింది!: కేజ్రీ రాజీనామాపై బీజేపీ సంబరం

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠం నుంచి దిగిపోవడంతో బీజేపీ సంబరపడిపోతోంది. ఆ పార్టీ జాతీయ నేత అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, పీడకల ముగిసిందన్నారు. ఇంత చెత్త పాలనను చూడబోమని, దానికి ఇప్పుడు శుభం కార్డు పడిందని వ్యాఖ్యానించారు. పాలన పక్కనబెట్టి తెలివైన రాజకీయాలు నడిపించడమే ఆమ్ ఆద్మీ నినాదమన్నారు. ఓ అజెండా అంటూ లేని పార్టీ ఇదేనని విమర్శించారు. జన్ లోక్ పాల్ బిల్లుకు అసెంబ్లీలో ఓటమి ఎదురవడంతో గత రాత్రి తన ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News