: తొలి రోజు మనదే
న్యూజిలాండ్ పర్యటనలో చావుదెబ్బలు తింటోన్న భారత్ ఎట్టకేలకు పుంజుకుంది. వెల్లింగ్టన్ లో మొదలైన రెండో టెస్టులో తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచిన ధోనీ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోగా.. పేసర్లు ఇషాంత్ శర్మ (6/51), మహ్మద్ షమి (4/70) కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయలేదు. భారత పేసర్ల జోరుకు కివీస్ వద్ద సమాధానమే లేకపోయింది. ఇషాంత్, షమి బౌన్స్, స్వింగ్ మిళితం చేసి కివీస్ లైనప్ ను కకావికలం చేశారు. దీంతో, ఆతిథ్య జట్టు 192 పరుగులకే చాపచుట్టేసింది. ఆ జట్టులో విలియమ్సన్ (47) టాప్ స్కోరర్. చివర్లో కొత్తముఖం నీషామ్ (33), సౌథీ (32) బ్యాట్లకు పనిచెప్పడంతో కివీస్ కు ఆ మాత్రం స్కోరైనా దక్కింది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్ ఫామ్ ను కొనసాగిస్తూ 71 పరుగులతో క్రీజులో ఉండగా, నైట్ వాచ్ మన్ గా బరిలో దిగిన ఇషాంత్ 3 పరుగులతో ఆడుతున్నాడు. మరో ఓపెనర్ విజయ్ 2 పరుగులకే వెనుదిరగగా.. వన్ డౌన్ హీరో ఛటేశ్వర్ పుజారా (19) తీవ్రంగా నిరాశపరిచాడు.