: నీటి గుంతలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లాలోని కొంపల్లి జయభేరి కాలనీలో ఈరోజు విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తల్లిదండ్రులను శోక సంద్రంలో ముంచివేసింది. ఈ ముగ్గురూ కూడ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తల్లిదండ్రుల రోదన చూసిన వారు చలించిపోయారు.

ప్రమాదం జరిగిన ప్రదేశం క్వారీ కోసం తవ్విన ప్రదేశం. అక్కడ లోతైన నీటి గుంతలు ఉన్నాయని, దిగితే ప్రమాదమని క్వారీ యజమానులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. స్కూలుకని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన బాలురు.. ఆడుకునేందుకు ఇక్కడకు వచ్చి, ఈ నీటి గుంతలో దిగి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల మృత దేహాలను వెలికి తీస్తున్నారు. వారు ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇంద్రజిత్, నిఖిల్, శ్రవణ్ గా గుర్తించారు.

More Telugu News