: నేడు ఢిల్లీ అసెంబ్లీకి రానున్న జన్ లోక్ పాల్ బిల్లు

అత్యంత కీలకమైన, వివాదాస్పదమైన జన్ లోక్ పాల్ బిల్లు ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ గడప తొక్కనుంది. ఎంతో మంది నేతలు, అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న ఈ బిల్లును ఈ రోజు ఎలాగైనా సభలో ప్రవేశపెట్టాలని కేజ్రీవాల్ ప్రభుత్వం పట్టుదలతో ఉంది. జన్ లోక్ పాల్ బిల్లు అసెంబ్లీ ముందుకు రాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఇప్పటికే కేజ్రీవాల్ హెచ్చరించారు. దీంతో ఏమి జరగబోతోందా? అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.

More Telugu News