: నిలకడగా కొనకళ్ల ఆరోగ్యం.. పరామర్శించిన పలువురు నేతలు
నిన్న పార్లమెంటులో తీవ్ర ఉద్రిక్తతకు లోనై సభలోనే కుప్పకూలిన టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పార్టీలకతీతంగా కొనకళ్లను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు. పరామర్శించిన వారిలో లగడపాటి, కావూరి, సబ్బం హరిలతో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు. కొనకళ్ల సతీమణి పద్మజ కూడా అనారోగ్యంతో ఉండటంతో... గత నాలుగు రోజులుగా ఆమె విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొనకళ్ల దంపతులిద్దరూ ఒకేసారి అనారోగ్యం బారిన పడటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.