: ఐపీఎల్ ఫిక్సింగ్ స్కాం దర్యాప్తులో సచిన్ పాత్ర..!
ఐపీఎల్-6 ఫిక్సింగ్ స్కాంలో దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు నియమించిన ఈ దర్యాప్తు కమిటీ జస్టిస్ ముద్గల్ నేతృత్వంలో నివేదికను రూపొందించింది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్ కు ఫిక్సింగ్ లో భాగస్వామ్యం ఉందని నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చెప్పిన కొన్ని విషయాలు తమ దర్యాప్తుకు విశేషంగా తోడ్పడ్డాయని ముద్గల్ కమిటీ సభ్యుడు ఎల్.నాగేశ్వరరావు తెలిపారు.
ఇటీవలే తన చివరి టెస్టు ఆడిన సచిన్ అనంతరం ముద్గల్ కమిటీ ముందు హాజరై ఐపీఎల్ లో అక్రమాలకు సంబంధించి ఎన్నో విషయాలు పంచుకున్నాడని వెల్లడించారు. సచిన్ చెప్పిన విషయాలే దర్యాప్తు ముందుకు సాగడంలో కీలకమయ్యాయని నాగేశ్వరరావు పేర్కొన్నారు. టీమిండియా కెప్టెన్ ధోనీ కూడా తమ ముందు హాజరయ్యాడని రావు తెలిపారు. కాగా, మరో ఆరుగురు క్రికెటర్లు కూడా ఫిక్సింగ్ లో పాత్రధారులే అని వార్తలు వస్తుండగా, వారిలో ఓ టీమిండియా క్రికెటర్ ఉన్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అధికారికంగా ఈ విషయం వెల్లడవ్వాల్సి ఉంది.