: కాంగ్రెస్ కు కేజ్రీవాల్ షాక్!
కేజ్రీవాల్ ఎన్నికల హామీలు ఒకదాని తరువాత ఒకటి నెరవేర్చుకుంటూ పోతున్నాడు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో చెలరేగిన అల్లర్లపై సిట్ వేయనున్నారు. ఢిల్లీ అల్లర్ల కేసును తిరగదోడడంపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య వివాదం నడిచింది. వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉంది కనుక, ప్రత్యేక దర్యాప్తు బృందం వేయాలని కేజ్రీ గవర్నర్ ను కోరారు. దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించింది.
అయినప్పటికీ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలతో లెఫ్టినెంట్ గవర్నర్ పై ఎదురుదాడికి దిగారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ దిగివచ్చి సిట్ ఏర్పాటుకు అనుమతిచ్చారు. దీంతో కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీపై విజయం సాధించినట్టైంది. ఇందిరాగాంధీని సిక్కు మతానికి చెందిన వ్యక్తులు హత్య చేయడంతో ఢిల్లీ అట్టుడికిపోయింది. కాంగ్రెస్ కార్యకర్తలు సిక్కులను ఊచకోత కోశారు. దీనిపై సిట్ వేయడం లోక్ సభ ఎన్నికల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూలాంశం కానుంది.