: వాయిదా అనంతరం ప్రారంభమైన రాజ్యసభ.. మళ్లీ వాయిదా

10 నిమిషాల వాయిదా అనంతరం రాజ్యసభ ప్రారంభమైంది. అయితే సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. రాష్ట్ర విభజనను అడ్డుకుంటున్న ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ పెద్ద ప్లకార్డును ఛైర్మన్ అన్సారీ ముందు నిలబడి ప్రదర్శించారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ బిల్లు ప్రతులను చింపి ఛైర్మన్ టేబుల్ మీదకు విసిరేశారు. ఈ గందరగోళ పరిస్థితుల్లో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ ఛైర్మన్ అన్సారీ ప్రకటించారు.

More Telugu News