: నేడు సోనియాను కలవనున్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు
విభజన బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడంపై ఢిల్లీలో ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలువురు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు ఈ రోజు పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్, మల్లు భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సోనియాను కలిసి భద్రాచలం ముంపు గ్రామాలను ఖమ్మంలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేయనున్నారు.