: న్యాయశాఖ అభ్యంతరం ... తెలంగాణ బిల్లు మళ్లీ రాష్ట్రపతి వద్దకే!

తెలంగాణా బిల్లు మళ్లీ రాష్ట్రపతి వద్దకు చేరింది.
వాస్తవానికి ఈ రోజు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టాల్సి వుంది.
అయితే, బిల్లులో ఆర్ధికాంశాలు ఇమిడి వున్నందున రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అభ్యంతరం వ్యక్తం చేసి, ఈ విషయంలో న్యాయ సలహా కోరడం జరిగింది.
ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని న్యాయశాఖ తేల్చిచెప్పింది.
దాంతో బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపిస్తున్నారు. రేపు లోక్ సభలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం రాష్ట్రపతిని కోరుతోంది.
దీంతో ప్రభుత్వ వ్యూహం బెడిసికొట్టినట్టయింది. లోక్ సభలో సీమాంధ్ర సభ్యులు ఎక్కువగా ఉన్నందున ముందుగా అక్కడ ప్రవేశపెడితే అడ్డంకులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో, ప్రభుత్వం రాజ్యసభను ఎంచుకుంది.
ఈ నేపథ్యంలో రేపు లోక్ సభలో ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

More Telugu News