: సీఎం కిరణ్ జైలుకు వెళ్లడం ఖాయం: కోమటి రెడ్డి
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దగ్గరపడుతున్న కొద్దీ అవినీతి ఫైళ్లపై సీఎం జోరుగా సంతకాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంతో పాటు సీమాంధ్ర నేతలు కొందరు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.