: సోనియాతో డీఎస్ భేటీ
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సమావేశమయ్యారు. బుధవారం రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టనున్నారనే ఊహాగానాల నడుమ సోనియా, డీఎస్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ బిల్లు చిత్తశుద్ధితో తాము ప్రవేశపెట్టనున్నామని, బిల్లు ఆమోదం పొందుతుందని సోనియా గాంధీ, డీఎస్ కు భరోసా ఇచ్చినట్టు సమాచారం.