: నరేంద్ర మోడీని కలిస్తే తప్పేంటి?: శరద్ పవార్
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా తాను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలుస్తుంటానని... ఆ కోణంలో గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని కలిస్తే తప్పేంటని కేంద్ర మంత్రి శరద్ పవార్ ప్రశ్నించారు. ఇతర ముఖ్యమంత్రులను కలిస్తే పట్టించుకోని వారు... మోడీని కలిస్తే మాత్రం భూతద్దంలో నుంచి చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన థానేలో మీడియాతో మాట్లాడారు.