: కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తి లేదు: కావూరి
తాను కాంగ్రెస్ విధేయుడినని... కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడనని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ఏలూరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను ఇప్పటికీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నానని అన్నారు. పార్లమెంటులో టీబిల్లు ఆమోదం పొందే అవకాశం లేనేలేదని తెలిపారు. ఈ సందర్భంలో ఏపీఎన్జీవోలు కావూరిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.