: అక్కడ బతికున్నవారికీ అంత్యక్రియలు
క్యూబాలోని శాంటియాగో డీ లాస్ వెగాస్ గ్రామానికి వెళ్లి చూస్తే.. ప్రాణాలతో బతికున్న వారిని శవపేటికలో పడుకోబెడతారు.. బంధు మిత్రులందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. అందరూ వెంటరాగా శవపేటికను ఊరేగించుకుంటూ శ్మశానానికి తీసుకెళతారు. ఆరు అడుగుల పొడవున్న గొయ్యిలో శవపేటికను దించుతారు. మరోసారి అందరూ ఏడుస్తారు. చివరిగా గ్రామస్తులు శవపేటికలో చనిపోయినట్లుగా పడుకుని ఉన్నవ్యక్తి నోట్లో రమ్ పోస్తారు. అతడు లేచి కూర్చుంటాడు. అందరూ సంతోషంగా కలిసి తిరిగి ఇళ్లకు వెళతారు. ఏటా ఫిబ్రవరి 5న ఇలా చేయడం వారికి అలవాటు.