: ట్రాక్టర్ కింద పడి రంజీ క్రికెటర్ దుర్మరణం
హర్యానా రంజీ క్రికెటర్ సందీప్ సింగ్ (25) దుర్మరణం పాలయ్యాడు. స్వగ్రామం ముందాల్ లో మైదానాన్ని ఫుట్ బాల్ టోర్నీ జరిపేందుకు అనువుగా ట్రాక్టర్ తో చదును చేయిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ట్రాక్టర్ పై కూర్చుని ఉన్న సందీప్ ఒక్కసారిగా కిందపడడంతో చక్రాలు అతనిపైకి ఎక్కాయి. దీంతో, ఆ క్రికెటర్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సందీప్ మృతి వివరాలను బీసీసీఐ ట్రెజరర్, హర్యానా క్రికెట్ సంఘం అధ్యక్షుడు అనిరుధ్ చౌధరి మీడియాకు తెలిపారు. 17 ఏళ్ళ వయసులో రంజీ అరంగేట్రం చేసిన సందీప్ ఇప్పటి వరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు.