: 'దైవ కణం' ఆవిష్కర్తల మరో బృహత్ ప్రయత్నం

జీవరాశి ఆవిర్భావం గుట్టువిప్పేందుకు ఉద్ధేశించిన పరిశోధనలకు ఆయువు పోసిన ఆవిష్కరణ 'దైవ కణం'. స్విట్జర్లాండ్ లోని సెర్న్ భూగర్భ ప్రయోగశాలో ఉద్భవించిన ఈ హిగ్స్ బోసాన్ పార్టికల్.. దైవ కణంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. హాడ్రాన్ కొల్లైడర్ తో అణువులను తాడనం జరపడం ద్వారా ఈ కణాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. అయితే, పాత కొల్లైడర్ కంటే ఏడు రెట్లు అధిక శక్తి కలిగిన లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్ (ఎల్ హెచ్ సీ) కు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. దీనిపేరు ఫ్యూచర్ సర్క్యులర్ కొల్లైడర్ (ఎఫ్ సీసీ). విశ్వం గురించి విజ్ఞానాన్ని ఇది కొత్త పుంతలు తొక్కిస్తుందని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇప్పుడు మొదలు పెడితే ఎల్ హెచ్ సీ నిర్మాణం పూర్తయ్యేసరికి 25 ఏళ్ళు పడుతుందని తెలుస్తోంది.

More Telugu News