: నాలుగు రోజుల పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాలు
ఈ నెల పది నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ రోజు నుంచి నాలుగు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. తొలిరోజు ఉదయం 10.30 నిమిషాలకు మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి ఓటాన్ అకౌంట్ ను ప్రవేశపెట్టనున్నారు. అదేరోజు ఉదయం 9 గంటల నుంచి 10 వరకు మంత్రివర్గ సమావేశం జరగనుంది.