: అవును.. అతడిని వాళ్లందరూ చంపేశారు!

నిజం తేలిపోయింది. 17 నెలల తర్వాత పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వ్యక్తి అనుమానాస్పద మృతిని హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొవ్వూరు డీఎస్పీ రాజగోపాల్ ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.
ఇటీవల పాత కేసుల ఫైళ్లను తిరగేస్తున్న తాడేపల్లిగూడెం పట్టణ సీఐ మూర్తి దెయ్యాల శ్రీను కేసుకు సంబంధించి పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. మృతుని ఒంటిపై ఎనిమిది చోట్ల గాయాలున్నట్లు తెలుసుకున్న సీఐ, ఎస్సై కొండలరావుతో కలసి కేసును ఛేదించారు. దీనితో అనుమానాస్పద మృతిని 2014, జనవరి 28న తిరిగి హత్య కేసుగా నమోదు చేశారు. కేసులో నిందితులైన పాత సీసాల వ్యాపారి సింగిరెడ్డి వెంకటేశ్వరరావు, తూ.గో. జిల్లాకు చెందిన వ్యాన్ డ్రైవర్ దూనబోయిన రాము, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన దాసరి పాపారావు, చిన్న వెంకటేశ్వరరావు, పరమకాంతు లను కొవ్వూరు డీఎస్పీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసును ఛేదించిన సీఐ మూర్తి, ఎస్సై కొండలరావును డీఎస్పీ అభినందించారు.

More Telugu News