: స్నాప్ చాట్ లో పొంచి ఉన్న బగ్

కొత్త రకం బగ్ స్నాప్ చాట్ యూజర్లపై దాడి చేస్తోంది. ఫొటోల షేరింగ్ అప్లికేషన్ అయిన స్నాప్ చాట్ ద్వారా స్మార్ట్ ఫోన్లపై దాడి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ బగ్ ద్వారా హ్యాకర్లు స్మార్ట్ ఫోన్లలోని ఇన్ బాక్స్ ను మెస్సేజీలతో నింపేస్తారు. దాంతో ఫోన్ క్రాష్ అవుతుందని టెక్ క్రంచ్ వెల్లడించింది. దీంతో తప్పేది లేక యూజర్లు తమ ఫోన్ ను రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు స్నాప్ చాట్ ప్రకటన జారీ చేసింది.

More Telugu News