: అధిష్ఠానం కనుసన్నల్లోనే సీమాంధ్ర కేంద్ర మంత్రులు: ఏపీఎన్జీవో

ఏపీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి సీమాంధ్ర కేంద్ర మంత్రులపై విరుచుకుపడ్డారు. తెలంగాణ బిల్లును అడ్డుకోలేకపోయిన కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులందరూ కాంగ్రెస్ అధిష్ఠానం కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. అన్ని మండల కేంద్రాల్లో కేంద్ర మంత్రుల దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తామని చెప్పారు.

More Telugu News