: గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలకు ఫోన్ చేసిన సీఎం

ఢిల్లీలో తమను తీవ్ర అవమానాలకు, ఆవేదనకు ముఖ్యమంత్రి కిరణ్ గురిచేశారని మంత్రి గీతారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. సీఎం కిరణ్ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడానికి బయలుదేరుతున్న సమయంలో... టీమంత్రులు దారికి అడ్డంగా బైఠాయించారు. ఈ సందర్భంగా అక్కడున్న పోలీసులు వీరిని పక్కకు లాగేశారు. ఈ ఘటనలో వీరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మంత్రులు గీతారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలకు సీఎం కిరణ్ ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేసినట్టు సమాచారం.

More Telugu News