: మా ప్రాంత సమస్యలు కూడా వినండి: సీమాంధ్ర కేంద్ర మంత్రులు
సీమాంధ్ర ప్రాంత కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిశారు. ఢీల్లీలో వారు మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంత సమస్యలను కూడా వినాలని అధిష్ఠానానికి విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం ఇచ్చామని అన్నారు. ఇరు ప్రాంతాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలని పార్టీ అధిష్ఠానాన్ని కోరామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అసమంజసంగా ఉందని అధిష్ఠానానికి తెలిపినట్టు వారు వెల్లడించారు. హైదరాబాద్ లోని సామాన్య, మధ్యతరగతి ప్రజల్లో ఉన్న ఆందోళనలు తొలగించాలని, అందుకు హైదరాబాద్ ను యూటీ చేయాలని తాము సూచించామన్నారు. హైదరాబాద్ ను 53 ఏళ్ల పాటు తామంతా కలసి అభివృద్ధి చేసుకున్నామని వివరించామన్నారు.