: గోల్కొండ హోటల్ లో టి.కాంగ్రెస్ నేతల భేటీ.. హాజరైన బొత్స
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో టి.కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో భేటీ అయ్యారు. తమ ముగ్గురు అభ్యర్థులకు ఓటు వేసిన అనంతరం, మిగిలిన ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి కె.కేశవరావుకు వేసే విషయంపై వీరు చర్చిస్తున్నారు. ఈ భేటీకి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను విలీనం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో, మిగులు కాంగ్రెస్ ఓట్లను కేకేకు వేయడంలో అభ్యంతరం లేదని టి.కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.