: పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడితే, సీఎం రాజీనామా..?

రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా పార్లమెంటులో ప్రవేశపెడితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తానని నిన్న రాత్రి మంత్రుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. రాజ్యసభలో 10వ తేదిన విభజన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాజీనామాల విషయంలో అందరం కలసే నిర్ణయం తీసుకుందామని, కేంద్రం చర్యను బట్టే మన ప్రతిచర్య ఉండాలని ఓ మంత్రి సూచించినట్టు సమాచారం. కాగా, బిల్లు హోంమంత్రిత్వ శాఖకు చెందిన స్టాండింగ్ కమిటీకి వెళ్ళాలని అంటున్నారని, దానికి చైర్మన్ అయిన వెంకయ్యనాయుడు ఈ విషయం పరిశీలించాల్సి వుంటుందనీ, అప్పుడు ఏమవుతుందో చూద్దామని కిరణ్ కుమార్ రెడ్డి అన్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి, సాకే శైలజానాథ్ తో పాటు, సీమాంధ్రకు చెందిన పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

More Telugu News