: సోషల్ మీడియాలో హల్ చల్.. మనం అంత దిగజారిపోయామా?
ఓ స్లోగన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, వి చాట్ మొదలైన అన్ని సోషల్ సైట్లలో ఓటర్లను మేల్కొలుపుతూ ఓ వ్యాఖ్య తెగ సంచలనం రేపుతోంది. అదేంటంటే, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ఓటుకు 500 రూపాయలు ఓటర్లకు ఇచ్చి గెలిస్తే, 5 సంవత్సరాలు అతను ఎమ్మెల్యేగా ఉంటాడు. 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు. 500 రూపాయలను రోజుకు లెక్కగడితే, రోజుకు 27 పైసలు అయింది. బిచ్చమెత్తుకునే వాడు కూడా 27 పైసలు తీసుకోడు. మరి, మనమెందుకు తీసుకోవాలి? ఆలోచించండి! రానున్న రోజుల్లో ఎవరిని ఎన్నుకోవాలో మనమే నిర్ణయించుకుందాం. అంటూ ఎన్నికల్లో అభ్యర్థులపై ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్న వ్యాఖ్య సోషల్ మీడియాను కుదిపేస్తోంది.