: పార్లమెంట్ మెయిన్ గేట్ వద్ద సీమాంధ్ర టీడీపీ ఎంపీల ధర్నా
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మరి కాసేపట్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, గేట్-1 వద్ద వీరు ధర్నా చేపట్టారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ ప్లకార్డులు చేతబట్టి... కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.