: ప్రణబ్ ప్రధాని కాకుండా కాంగ్రెస్ రెండు సార్లు అడ్డుకుంది : మోడీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని భారత ప్రధాని కాకుండా గాంధీ కుటుంబం రెండు సార్లు అడ్డుకుందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు కోల్ కతాలో ఉన్న రాజీవ్ గాంధీ ఢిల్లీ చేరుకున్నారని, కానీ వాస్తవానికి ప్రజాస్వామ్య వ్యవస్థలో సీనియర్ మంత్రికి ప్రధాని పదవి దక్కాలని అన్నారు. అప్పట్లో ప్రణబ్ సీనియర్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని మోడీ తెలిపారు.
తొలిసారి గాంధీ కుటుంబం ఆయన ప్రధాని కాకుండా అడ్డుకుని, రాజీవ్ గాంధీని ప్రధానిని చేసి ప్రణబ్ కు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదని అన్నారు. తరువాత 2004లో సోనియా గాంధీ ప్రధాని పదవిని తిరస్కరించినప్పుడు కూడా ప్రణబ్ ను కాదని మన్మోహన్ సింగ్ ను ప్రధానిని చేశారని మోడీ తెలిపారు. ప్రణబే ప్రధాని అయి ఉంటే దేశ పరిస్థితి మరోలా ఉండేదని మోడీ అభిప్రాయపడ్డారు. ప్రణబ్ కు జరిగిన అన్యాయాన్ని బెంగాల్ ప్రజలు మరువకూడదని ఆయన సూచించారు.