: సీఎంను అడుగడుగునా అడ్డుకునేందుకు ప్రయత్నించిన తెలంగాణ వాదులు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని అడ్డుకునేందుకు తెలంగాణ వాదులు అడుగడుగునా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లును అడ్డుకునేందుకు తన వంతు ప్రయత్నాలు ప్రారంభించిన కిరణ్ కుమార్ రెడ్డిని ఎలాగైనా అడ్డుకోవాలనే తపనతో తెలంగాణ వాదులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తొలుత ఆంధ్రాభవన్ వద్ద కాన్వాయ్ లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా సమైక్యాంధ్రుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అనంతరం రాజ్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కిన బస్సును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు ప్రయత్నించారు. ముఖ్యమంత్రి సంయమనం కోల్పోకుండా రాష్ట్ర విభజనను అడ్డుకుంటామంటూ జంతర్ మంతర్ కు వెళ్లారు.

More Telugu News