: సీఎం వాహనాన్ని అడ్డుకున్న తెలంగాణ మంత్రులు
ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాజ్ ఘాట్ కు బయలు దేరిన సీఎం బస్సును తెలంగాణ మంత్రులు, నేతలు అడ్డుకున్నారు. వీరిలో మహిళా మంత్రులు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి కూడా ఉన్నారు. సీఎం రాజీనామా చేసి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని వారు నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి వాహనం ముందుకు వెళ్లకుండా వారంతా రోడ్డుపై కూర్చున్నారు. సీఎం ప్రయాణిస్తున్న బస్సులో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, ఆ ప్రాంతంలో భారీగా మోహరించిన ఢిల్లీ పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. చివరకు ఎలాగోలా వాహనాన్ని ముందుకు పంపించారు. దీంతో సీఎం కాన్వాయ్ రాజ్ ఘాట్ కు బయల్దేరింది.