: పార్లమెంటులో బిల్లుల ఆమోదంపై చిదంబరం అనుమానం?

పార్లమెంటు సమావేశాలు ఈ ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభల్లో పలు బిల్లుల ఆమోదంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో ఏ బిల్లు అయినా ఆమోదం పొందుతుందా? అని ఢిల్లీలో ప్రశ్నించారు. చివరి లోక్ సభ సమావేశాలు కావడంతో పలు ప్రధాన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలని యూపీఏ ప్రభుత్వం చూస్తోంది. అటు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును కూడా పెడతామని స్పష్టం చేసింది. అటు సమావేశాలు జరగనిచ్చేది లేదని సీమాంధ్ర ఎంపీలు ఇప్పటికే చెప్పారు. మరోవైపు సభలో పెట్టే బిల్లులకు బీజేపీ వెంటనే ఓకే చెప్పడానికి సిద్ధంగా లేదు. ఇలాంటి సమయంలో బిల్లుల ఆమోదం కష్టతరం అవుతుందనడంలో సందేహం లేదు.

More Telugu News