: జ్ఞాన సరస్వతీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు

హైదరాబాదు గాంధీ ఆస్పత్రి సమీపంలోని జ్ఞాన సరస్వతీ ఆలయంలో మంగళవారం ఉదయం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వసంత పంచమిని పురస్కరించుకొని, తల్లిదండ్రులు చిన్నారులతో సహా అమ్మవారిని దర్శించుకుని అక్షరాభ్యాసాలు చేయించారు. సరస్వతీదేవి సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే, అమ్మవారు విద్య, జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అనంతరం అర్చకులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

More Telugu News