: రాజ్యసభ ఎన్నికలకు పరిశీలకుల నియామకం
ఆంధ్రప్రదేశ్, అసోం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ల్లో ఈ నెల 7న జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే సమయంలో చోటు చేసుకునే అక్రమాలు, డబ్బు పాత్రపై పరిశీలకులు దృష్టి పెట్టనున్నారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని పరిశీలించాలని ఈసీ ఆదేశించింది. అంతేగాక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఛానల్స్ లో ప్రసారమయ్యే వార్తలపైన కూడా వారు ఓ కన్నేస్తారు.