: ఏసీబీ వలలో అవినీతి ఏఈ
రైతులకు ట్రాన్స్ ఫార్మర్ పరికరాలు అందజేయడానికి గాను లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడో ట్రాన్స్ కో అవినీతి ఏఈ. అనంతపురం జిల్లా ధర్మవరంలో రైతు రామిరెడ్డి నుంచి రూ. 3500 లంచం తీసుకుంటుండగా ఏఈ మల్లయ్యను ఏసీబీ డీఎస్పీ భాస్కర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మల్లయ్యను రేపు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.