: తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం అప్రజాస్వామ్యం: ఏరాసు
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం అప్రజాస్వామ్యమని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఉభయ సభలు తిరస్కరించిన బిల్లును ఏ ప్రాతిపదికన పార్లమెంటులో ప్రవేశపెడతారని ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న విలువైన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉండగా, తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాల్సిన అగత్యం ఏంటని ఆయన కాంగ్రెస్ అధిష్ఠానాన్ని నిలదీశారు.