: మోహన్ బాబు పద్మశ్రీ అవార్డుపై హైకోర్టులో విచారణ

తెలుగు చిత్రసీమలోని ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు పద్మశ్రీ అవార్డుపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. దీనికి సంబంధించి నాలుగు వారాల్లోపు రాష్ట్రపతికి నివేదిక అందించాలని న్యాయస్థానం కేంద్ర హోంశాఖను ఆదేశించింది. నివేదిక అందిన తర్వాత, పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలా? వద్దా? అనే విషయంపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు పేర్కొంది.

తమ పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతికి సరెండర్ చేయాలని నటుడు బ్రహ్మానందం, మోహన్ బాబులకు కోర్టు నోటీసులు పంపిన విషయం విదితమే. పద్మశ్రీ అవార్డును పేరుకు ముందు ఉపయోగించవద్దని మోహన్ బాబును హైకోర్టు ఆదేశించింది.

More Telugu News