: లోక్ సభ స్పీకర్ కు జగన్ లేఖ
లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ కు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. సమయాభావం వల్ల తాను పార్లమెంటులో నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాలేకపోతున్నట్లు తెలిపారు. అంతేకాక అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దని, ఇదే పార్టీ వైఖరిగా భావించాలని కోరారు. అసలు విభజన అప్రజాస్వామికమని, బిల్లు విషయంలో రాజ్యాంగ విలువలు పాటించాలని జగన్ లేఖలో తెలిపారు.