: అమెరికాను కుదిపేసిన భారీ మంచు తుఫాను
అమెరికాలోని న్యూయార్క్, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, ఓహియో, మేరీల్యాండ్, డెలవర్, కనెక్టికట్, వెస్ట్ వర్జీనియా ప్రాంతాలను భారీ మంచు తుపాను కుదిపేసింది. న్యూయార్క్, ఫిలడెల్ఫియాల్లో 8 అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. మొత్తం 4,300 విమానాలు ఆలస్యంగా నడవగా, 1,900 విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు, కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి.