: బాసరలో ప్రారంభమైన వసంత పంచమీ వేడుకలు
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో వసంత పంచమీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు రాత్రి ఒంటిగంటకు ప్రత్యేక అభిషేకంతో మొదలయ్యాయి. అక్షరాభ్యాసం కోసం భక్తులు సరస్వతీ అమ్మవారి సన్నిధిలో 2 కిలోమీటర్ల మేర బారులు తీరారు. సరస్వతీ దేవి జయంతి ఈ రోజే కావడం వలన దీనిని 'శ్రీ పంచమి' అని అంటారు.