: కిరణ్ గారూ.. 10 జనపథ్ లో పోరాడండి: చంద్రబాబు నాయుడు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో పోరాడుతామంటున్నారని, వీధుల్లో ఎవరి మీద పోరాడుతారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాత నటుడు జగన్ ను వదిలేసి, కొత్త నటుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తెరమీదికి తీసుకువచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి దీక్షలు ఎక్కడో చేయడమెందుకనీ, 10 జనపథ్ మీద పోరాడాలని ఆయన సూచించారు. కిరణ్ కు చిత్తశుద్ధి ఉంటే సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేయాలని ఆయన సవాల్ విసిరారు. 10 జనపథ్ స్క్రిప్టు ప్రకారం సీఎం నటిస్తున్నాడని ఆయన ఆరోపించారు.

More Telugu News